ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులంటే నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్నది. ఇక శనివారంతో విపక్షాల ప్రచారాలు కూడా నిలిపివేయబడనున్నాయి. దాంతో ఈ రెండు రోజులు ఆయా పార్టీలు ప్రచారాలు వేగవంతం చేయనున్నాయి. అవును, రాష్ట్రంలో వైసీపీ, కూటమిలు సుడిగాలి పర్యటనలను షురూ చేసాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుతంత్రాలతో సంక్షేమ పథకాలను ఆపగలరు కానీ, వైసీపీ విజయాన్ని అయితే ఎవరు ఆపలేరని వ్యాఖ్యానించారు జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ఈ వేదికగా ఆయన మాట్లాడుతూ... విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసి ఎన్నికల్లో విజయం సాధించి విశాఖ నుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. ఉద్దానం సమస్యను సంపూర్ణంగా పరిష్కరించామని, కిడ్నీ ఆసుపత్రి, అదేవిధంగా రీసర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశామని అన్నారు జగన్. అదేవిధంగా 3 జిల్లాలను, 6 జిల్లాలుగా చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేశామని చెప్పుకొచ్చారు. ఇంకా ప్రతిపక్ష టీడీపీ నేత బాబు గురించి జగన్ మాట్లాడుతూ... "ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. ఢిల్లీ మెకానిక్స్ తో కలిసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నాడు. బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేస్తున్నారు! అయితే ఈసారి ఎన్ని కుయుక్తులు పన్నినా మా విజయాన్ని ఆపలేరు!" అని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... మేనిఫెస్టోలోని హామీలను దాదాపుగా 99 శాతం అమలు చేశామన్నారు. అదేవిధంగా తమ హయాంలో విద్యార్థుల కోసం అందించిన విద్యా కానుక, అమ్మబడి, గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను జనాలు లబ్ది పొందారు. విద్యారంగంలో అయితే మేము చేసిన అభివృద్ధి బాబు హయాంలో ఎపుడైనా సాధ్యమైందా? అంటూ ప్రశ్నించారు. జూన్ 4వ తేదీన మీ బిడ్డ అధికారంలోకి వస్తాడని, అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసిన అన్ని పథకాలను మళ్లీ అందిస్తామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: