ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఉన్న కొద్ది సమయాన్ని ఉపయోగించుకోడానికి గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీ నేతలు దూకుడు పెంచుతున్నారు.మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం కూడా నిలిపివేయనున్నారు అందుకే చివరి దశలో ఉన్నఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి నెల్లూరులో కూటమి అభ్యర్థుల తరపున టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.నెల్లూరులోని నర్తకి సెంటర్‌లో పవన్‌ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. జరగబోయే ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల గెలుపు ఓటములకు సంబంధించినది కాదు తెలుగు..జాతికి సంబంధించినది. రాతియుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి. రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమవుతున్నాయి. ఉద్యోగస్తులంతా తమ వైపు ఉండాలి.కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
 
రెండో సంతకాన్ని జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం పెడతానంటూ అన్నారు.భూముల రికార్డులన్నీ ఆన్‌లైన్‌ లోనే ఉంటాయని.. ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్‌ అనుమతి కావాలని చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులపై జగన్‌ పెత్తనం ఎందుకని ప్రశ్నించారు.నెల్లూరు-తిరుపతి-చెన్నైను ట్రైసిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరును హార్డ్ వేర్, ఎలక్రానిక్ హాబ్ తయారు చేస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారం లోకి వస్తే బీసీ డిక్లరేషన్‌ తో పాటు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. పింఛన్ దారులకు ఏప్రిల్ నుంచి రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులకు వచ్చే ఏళ్లలో లక్ష రూపాయలు అందజేస్తామన్నారు. ప్రతి సంవత్సరం యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: