- ఢిల్లీ స్థాయిలో ప‌లుకుబ‌డి సొంతం
- యాద‌వుల్లో ఇలాంటి గట్స్‌, ద‌మ్మున్న లీడ‌ర్లే కావాలి

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

శ‌ష‌భిష‌లు ఏమీ లేవు.  మాట‌ల మ‌ర్మాలు అస‌లే లేవు. అంతా చేసి చూపించ‌డ‌మే. త‌న‌కున్న ప‌వ‌ర్ ఏంటో కార్య‌రూపంలోకి తీసుకురావ‌డ‌మే. ఇదీ.. ప్ర‌స్తుత రాజ‌కీయ నేత‌ల‌కు.. భార‌త చైత‌న్య యువ‌జ‌న  పార్టీ చీఫ్‌.. బోడే రామ‌చంద్ర‌యాద‌వ్‌కు మ‌ధ్య అతి పెద్ద తేడా. ఇతర నేతలు.. మాట‌లు చెప్ప‌డం మ‌నం చూస్తున్నాం. కేంద్రాన్ని దింపేస్తాం.. మెడ‌ప‌ట్టి సాధిస్తాం.. అంటూ.. ఇత‌ర పార్టీల నాయ‌కులు ప‌దే ప‌దే చెబుతున్నారు. కానీ, ఏ ఒక్క ప్ర‌యోజ‌నాన్ని కూడా.. సాధించిన వారు లేదు.


కానీ.. పిట్ట కొంచ‌మే అయినా.. కూత ఘ‌నం అన్న చందంగా.. ప‌ట్టుమ‌ని మూడేళ్లుగా కూడా నిండ‌ని.. భార‌త చైతన్యయువ‌జ‌న పార్టీ అధ్య‌క్షుడు బోడే రామ‌చంద్రయాద‌వ్‌.. చెప్ప‌రు.. చేస్తారు! అనే టాక్ జోరుగా వినిపిస్తోంది. కేంద్రంలో ఉన్న ప‌లుకుబ‌డిని వినియోగించ‌డంలోనూ... లాబీయింగ్ చేయ‌డంలోనూ త‌న‌కు తానే సాటి అని అనిపించుకున్నారు. ఆయ‌న‌కు ఒక్క సీటు లేదు.. ప‌ట్టుమ‌ని ల‌క్ష ఓట్లు కూడా లేవు. అయినా.. రాష్ట్రంలో జ‌రుగుతున్న అరాచ‌కాల‌పై ఆయ‌న పోరాడుతున్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై కొట్లాడే మ‌న‌స్త‌త్వంతో ముందుకు సాగుతున్నారు.


పుంగ‌నూరులో మంత్రి పెద్దిరెడ్డి టీం చేసిన తీవ్ర అర‌చ‌కాల‌ను ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌తిఘ‌టిస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల‌ జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఢిల్లీ వ‌ర‌కు తీసుకువెళ్ల‌డంలోనూ.. దీనిపై హుటాహుటిన యుద్ధ‌ప్రాతిప దిక‌న చ‌ర్య‌లు తీసుకునేలా చేయ‌డంలోనూ బోడే స‌క్సెస్ అయ్యారు. గుండుగుత్త‌గా.. జిల్లాలోని కీల‌క పోలీసు అధికారుల‌ను బదిలీ చేయించ‌డంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యారంటే.. ఇదేమీ చిన్న విష‌యం కాదు. క‌ట్ చేస్తే.. ఇలాంటి వారిని గెలిపించుకుంటే.. రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు ఎంత మేలు జ‌రుగుతుంద‌నేది ముఖ్యంగా ఆలోచించాల్సిన విష‌యం.


పుంగ‌నూరులో పెద్దిరెడ్డి టీం బోడేపై దాడి చేసి తిరిగి ఆయ‌న‌పైనే కేసులు పెట్టారు. దీంతో ఆయ‌న ఢిల్లీ స్థాయిలో త‌న ప‌లుకుబ‌డి ఉప‌యోగించారు. ఇక్క‌డ అన్యాయాన్ని అక్క‌డ‌కు తీసుకువెళ్లారు. దీంతో డీఐజీ అమ్మిరెడ్డిపై వేటు ప‌డింది. డీఎస్పీ మ‌హేశ్వ‌ర్‌రెడ్డి, సీఐ రాఘ‌వ‌రెడ్డితో పాటు ఎస్ఐ మారుతిపై ఈసీ బ‌దిలీ వేటు వేసింది. పోరాడితే పోయేదేమీ లేదు.. అన్న సూక్తిమేర‌కు.. ఆయ‌న చేస్తున్న పోరాటాల ఫ‌లితంగా పుంగ‌నూరులో ప్ర‌జాస్వామ్యానికి ఊపిరి ఊదేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బోడే వంటివారు.. రాష్ట్ర వ్యాప్తంగా విజ‌యం ద‌క్కించుకుంటే.. అంతిమంగా అది ప్ర‌జ‌ల‌కు ఎంత మేలు చేయిస్తుంద‌నేది పుంగ‌నూరు ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన‌వి చాలానే ఉన్నాయి.


విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న‌ హ‌క్కులే కావొచ్చు.. పోల‌వ‌రం, ప్ర‌త్యేక హోదా వంటి.. సంక్లిష్ట అంశాలే కావొచ్చు.. వీటిని సాధించ‌డంలో ప్ర‌ధాన పార్టీలు విఫ‌ల‌మ‌య్యాయి. కానీ, ఇలాంటివాటిని కూడా బోడే రామ‌చంద్ర‌యాద‌వ్ సాధించ‌గ‌ల‌ర‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా పుంగ‌నూరు వంటి పెద్దిరెడ్డి కోట‌రీల‌నే బ‌ద్ద‌లు కొట్టిన నాయ‌కుడికి.. ఇత‌ర విష‌యాలు సాధించ‌డం ఎంత తేలికైన అంశ‌మో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. అయితే.. దీనికి కావాల్సింది.. ఆయ‌న‌కు అంద‌రూ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం... ఆయ‌న‌తోపాటు బీసీవై పార్టీ నాయ‌కుల‌ను గెలిపించ‌డం. మ‌రి చేస్తారా?  ప్ర‌జ‌లు ముందుకు క‌దులుతారా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: