ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం లో కూటమిలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి నిలబడింది. గత కొన్నేళ్లుగా పలు ప్రాంతాలను చుట్టేస్తే తన ఉనికిని చాటుకుంది. అయితే ఇటీవల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరింత ఉత్సాహంతో ఎన్నికలలో పాల్గొన్న ఈమె వడదెబ్బ తగలడంతో గత మూడు రోజుల నుంచి అస్వస్థకు గురై ఇటీవల ఇంటివద్దని చికిత్స చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున బండారు శ్రావణిని కూటమి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ జనసేన నేతలు పలువురు నాయకులు సైతం పెద్ద ఎత్తున ఆమెను పరామర్శించడానికి వెళ్లారు.


ఇలా వడదెబ్బతో తీవ్ర అస్వస్థకు గురైన బండారు శ్రావణిని త్వరగా కోలుకోవాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆమె కోసం ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శింగనమల చిన్న కాలువ ప్రాంతంలో శివాలయంలో గోవిందరాయుని పేట గ్రామానికి చెందిన కొంతమంది టిడిపి నాయకులు ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు కొట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఆర్మీ సురేష్ ,వెంకటపతి, సునీల్ తదితర నేతలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.


అయితే ఎలక్షన్స్ సమయం మరింత దగ్గర పడుతున్న కొద్ది ఈమె అనారోగ్య బారిన ఉండడంతో పలువురు నేతలు కార్యకర్తలు సైతం ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటీవలే ఈమె సోదరీ కూడా తన చెల్లెలు గెలుపు కోసం తన వంతు కృషిగా పలు ప్రాంతాలలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో టిడిపి పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణి ఈసారి ఎలాగైనా గెలవాలని కసితో పట్టుదలతో ముందుకు వెళ్తోంది. ఈమెకు ఆపోజిట్ గా వైసిపి పార్టీ నుంచి వీరాంజనేయులు పోటీ చేయబోతున్నారు.. అలాగే సీనియర్ నేత శైలజ నాథ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారని ఉత్కంఠత కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: