ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ ఐదు రోజులలో ఓటరు మనసు మార్చాలని ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. విపరీతమైన హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.ఇదిలా ఉంటే ప్రతి పక్ష పార్టీలు రాష్ట్రంలో అనేక సమస్యల గురించి ప్రశ్నిస్తూనే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ పిసీసీ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిల వివేకా హత్య కేసులో నిందితుడు  అయిన వైఎస్ అవినాష్ రెడ్డికి పోటీగా కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తుంది.. తన తండ్రి హత్య గురించి సీఎం జగన్ ఏనాడు పట్టించుకోలేదని పైగా తన తండ్రి హత్య కేసులో నిందితుడు అయిన అవినాష్ కు టిక్కెట్ ఇవ్వడం బాధ అనిపించింది అని వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత రెడ్డి ఆరోపించారు.. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇప్పటివరకు తన తండ్రి హత్య కేసు ముందుకు కదలనీకుండా చేసారు అని ఆమె ఆరోపించింది.

 ఈ సారి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి సొంత చెల్లెలుకి న్యాయం చేయని వ్యక్తి రాష్ట్రానికి ఏమి చేస్తారు అని ఆరోపించింది. కడప పార్లమెంట్ అభ్యర్థి అయిన వైఎస్ షర్మిలకు ఆమె మద్దతుగా నిలిచింది. ఇదిలా ఉంటే వైఎస్ సునీత రెడ్డి చెప్పేవి పచ్చి అబద్దాలని వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి తెలిపారు..వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన రోజు రక్తపు వాంతులతో మరణించారని తాను చెప్పలేదని కృష్ణారెడ్డి చెప్పారు. సునీత రెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి తనను హైదరాబాద్ పిలిపించి బెదిరించారాని కృష్ణారెడ్డి తెలిపారు.. సునీత రెడ్డి,ఆమె భర్త విచారణ లో అవినాష్ పేరు,భాస్కర్ రెడ్డి పేరు చెప్పమని బెదిరించినట్లు ఆయన తెలిపారు..దీనితో వివేకా కేసులో ఊహించని ట్విస్టులు పుట్టుకొస్తున్నాయి..ఈ కేసు ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: