ఏపీ సీఎం వైఎస్ జగన్ లో ఓటమి భయం కనిపిస్తోందని ఈ మధ్య కాలంలో కొన్ని కథనాలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే వైఎస్ జగన్ నైజం గురించి తెలిసిన వాళ్లు ఎవరూ ఈ కామెంట్లతో ఏకీభవించడం లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జగన్ కామెంట్లు చేస్తున్నారే తప్ప ఓటమి భయం ఆయనలో అణువంతైనా లేదని వైసీపీ అభిమానులు చెబుతున్నారు. తనను గెలిపిస్తారో ఓడిస్తారని ప్రజల ఇష్టమని జగన్ ఫీలవుతున్నారని భోగట్టా.
 
తాను ఏం చేస్తానో ఏం చేయగలనో ప్రజలకు చెప్పానని ప్రజల మద్దతు ఉంటే తమ పార్టీకే అనుకూల ఫలితాలు వచ్చి మరోసారి అధికారం దక్కుతుందని జగన్ ఫిక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది. అది మోదీ నుంచి తనపై విమర్శలు ఎదురవుతాయని మాత్రం జగన్ భావించలేదని ఈ విషయంలో మాత్రం ఆయన కొంతమేర నిరుత్సాహానికి గురయ్యారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
 
సీఎం జగన్ తను అమలు చేసిన సంక్షేమ పథకాలే విజయతీరాలకు చేరుస్తాయని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపు సునాయాసంగానే దక్కుతుందని మరీ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదని జగన్ భావిస్తున్నారట. జగన్ సొంత సర్వేలలో 100 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తాయని తేలిందని సమాచారం.
 
ఏ జిల్లాను తీసుకున్నా సగం కంటే ఎక్కువ స్థానాల్లో వైసీపీకి విజయం దక్కుతుందని వెల్లడైందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని స్థానాల్లో విజయం దక్కుతుందో కూటమికి ఎన్ని స్థానాల్లో విజయం దక్కుతుందో తెలియాల్సి ఉంది. ఎన్నికలకు ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పోల్ మేనేజ్ మెంట్ విషయంలో వైసీపీ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కూటమి నేతలు సైతం గెలుపు కోసం ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. వైసీపీ, కూటమి నేతలు ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: