ప్రస్తుతం ఏపీ రాజకీయ ప్రచారాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇన్ని రోజులు సభలు, సమావేశాలు, స్పీచ్ లు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి నాయకులు  ప్రస్తుతం  సైలెంట్ గా ప్రచారంలో మునిగిపోతున్నారు. గల్లీ నుంచి పట్టణాల వరకు  వారి వారి పార్టీల కీలక నాయకులను ఇన్చార్జులుగా పెట్టుకొని  చివరి అస్త్రంగా  రకరకాల ప్రలోభాలు చేస్తున్నారు. అయినా ఏ పార్టీ గెలుస్తోందనేది ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. ఈసారి చాలా సైలెంట్ ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇందులో ఒకటి మాత్రం గమనించాలి. ఈసారి ప్రజలు అన్ని పార్టీల నుంచి  కాస్తో కూస్తో  లాభపడ్డారని చెప్పవచ్చు. ఇలా లాభపడడం మంచి పద్ధతి కాకపోయినా, నాయకులు పెట్టే ప్రలోభాల వల్ల ప్రజలు డబ్బులు, గిఫ్టులు తీసుకోవాల్సి వస్తోంది.

 అలాంటి ఈ తరుణంలో కొన్ని సర్వే సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటే, మరి కొన్ని సర్వే సంస్థలు టిడిపి వస్తుంది అని చెబుతున్నారు. ఎవరూ కూడా క్లారిటీగా  ఈ పార్టీనే గెలుస్తుంది అనే సమాధానం మాత్రం ఇవ్వలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి.  ఈసారి టిడిపికి  జనసేన ఓట్లు మాత్రం ప్లస్ అవ్వనున్నాయి. ఇక బీజేపీ అంటే  రాష్ట్రంలో చాలా తక్కువ. అసలు బీజేపీ తో  చంద్రబాబు పొత్తు ఎందుకు పెట్టుకున్నాడని చాలామంది టిడిపి నేతలు ఆలోచనలో పడ్డారట. బీజేపీ వల్ల చంద్రబాబుకు లాభం కంటే కాస్త నష్టం అయ్యే అవకాశం ఉందని వారు ఆలోచిస్తున్నారట.  అదెలా అంటే బీజేపీ ఈసారి కేంద్రంలో 400 కు పైగా సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లన్నీ తీసేస్తాం  అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది.

 ఈ విధంగా రిజర్వేషన్లు తీసేయడం అనే పదం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నచ్చలేదు. దీనివల్ల ఆ వర్గాలకు చెందిన చాలామంది ప్రజలు  బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలకు ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగానే ఏపీలో కూడా టిడిపికి ఓట్లు వేద్దామని అనుకున్నా కొంతమంది ఎస్సీ, ఎస్టి, మైనారిటీలు బీజేపీతో జత కట్టింది కాబట్టి  వైసిపికి  వేయడమే మంచిదని ఆలోచిస్తున్నారట. ముస్లిం ఓట్లు అధికంగా  ఉన్నటువంటి నియోజకవర్గాల్లో  తప్పకుండా ఆ ఓట్లు వైసిపి వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిన్న లాజిక్ ను చంద్రబాబు మర్చిపోయి బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాడు ఏంట్రా అని  టిడిపిలో ఉన్నటువంటి నాయకులే తర్జన బర్జనా  పడుతున్నట్టు సమాచారం.  ఒకవేళ టిడిపి  ఏపీలో ఓడితే మాత్రం  ఆ తప్పు తప్పక బీజేపీ పైనే పడుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: