ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీకి ఇంకా ఐదు రోజుల సమయం కూడా లేదు. ఈ డేట్ పడుతున్న కొద్దీ ఏపీలో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కుతున్నాయి. ప్రచారాలు మరికొద్ది రోజుల్లోనే బంద్‌ కానున్నాయి. ఈ నేపథ్యంలోకి కీలక పార్టీల ప్రచారాల జోరు పెంచేసాయి. ఇటీవల ఎన్డీయే కూటమి కోసం ఏపీలో ప్రధాని మోదీ దిగిన సంగతి తెలిసిందే. అనకాపల్లి రాజమండ్రి ప్రాంతాలలో ఆయన స్వయంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఏపీలో మాట్లాడిన రెండు చోట్ల కూడా వైసీపీ సర్కార్‌ను తీవ్రంగా విమర్శించారు. వైసీపీ పరిపాలనలో ఏపీ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అవినీతి రెట్టింపు అయ్యిందని షాకింగ్ కామెంట్లు చేశారు.ప్రధాని మోదీ చేసిన ఆ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్  తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ పాలన గురించి చేసిన విమర్శలను తిప్పికొట్టారు. అలానే చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం ప్రధాని మోదీ తగినది కాదు అంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గత ఎలక్షన్స్‌కు ముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ప్రధాని మోదీ బాగా విమర్శించారు. అయితే అప్పుడు బాబు గురించి మోదీ ఏమన్నారో ఇప్పుడు జగన్ గుర్తు చేశారు. 2014-19 కాలంలో బీజేపీతో పొత్తులో కొనసాగించారు చంద్రబాబు. కానీ 2019 ఎలక్షన్ సమయంలో కూటమి నుంచి చల్లగా బయటికి వచ్చేసారు. ఈ కారణంగా చంద్రబాబు ఒక మోసగాడు అని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు పోలవరాన్ని ఏటీఎంగా మార్చేసి బాగా డబ్బులు లాగేసారని, ఆ ప్రాజెక్టును నాశనం చేశారని, అక్కడ ఎలాంటి అభివృద్ధి కొంచెం కూడా జరగలేదని మోదీ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కొడుకు లోకేష్ కోసమే తప్ప ప్రజల కోసం చంద్రబాబు పనిచేయడం లేదని ప్రధాని అప్పట్లో కామెంట్లు చేసినట్లు జగన్ గుర్తు చేశారు.

అప్పుడు అవినీతిపరుడు అయిన చంద్రబాబు ఇప్పుడు నీతిమంతుడు ఎలా అయ్యారు? వీరుడు సూర్యుడు అని ఎలా పొగుడుతున్నారు? చంద్రబాబును నెత్తికెత్తుకుని మోస్తున్నారుగా? ఆయనలో అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పు ఏంటి అంటూ మోదీ జవాబు చెప్పలేని ప్రశ్నలను జగన్ అడిగారు. మోదీ, చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసే ప్లాన్ చేశారని, రాష్ట్ర సొంత ఆస్తి అమ్ముతుంటే తాము చూస్తూ ఊరుకోమని కూడా స్పష్టం చేశారు. చంద్రబాబు పెద్ద మోసగాడు అని అలాంటి వ్యక్తికి బిజెపి వత్తాసు పలకడం బాధాకరంగా ఉందని కూడా జగనన్నారు. జగన్ చేసినా కామెంట్స్ వల్ల మోదీ రికార్డ్ లో పడ్డారు తెలుగు తమ్ముళ్లు సైలెంట్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: