భారతదేశంలో అతి పెద్ద సినిమా పరిశ్రమగా నిలిచిన బాలీవుడ్ మన దేశంతో పాటు ఎక్కువగా పలు ఇతర దేశాల ఆడియన్స్ నుండి మెప్పు పొందుతోంది. ఇక దాని తరువాత మన తెలుగు మూవీ ఇండస్ట్రీ తో పాటు తమిళ్ ఇండస్ట్రీ కూడా మంచి క్రేజ్, భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇటీవల దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు ఎల్లలు దాటి టాలీవుడ్ క్రేజ్ ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాయి. అనంతరం వరుసగా టాలీవుడ్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలు మన స్థాయిని మరింతగా పెంచుతున్నాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
ఇక విషయంలోకి వెళితే, ఏడాదిన్నర క్రితం నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అన్ని రంగాలని ఇబ్బందుల్లోకి నెట్టింది. దానితో గత ఏడాది ప్రారంభం నుండి మెల్లగా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవడం ఆరంభం అయింది. ఆ సమయంలో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ మూవీ పెద్ద సక్సెస్ కొట్టి ఇండస్ట్రీ కి కొత్త ఊపుని అందించింది. ఇక అక్కడి నుండి వరుసగా రిలీజ్ అయిన అనేక సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. వాటిలో ముఖ్యంగా జాతి రత్నాలు, శ్యామ్ సింగ రాయ్, అఖండ, ఉప్పెన, పుష్ప, వకీల్ సాబ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లవ్ స్టోరీ సినిమాలు అయితే భారీగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం జరిగింది.

కాగా మొత్తంగా గడచిన 2021వ సంవత్సరంలో ఈ టాలీవుడ్ సినిమాలు అన్ని కలిపి ఏకంగా రూ. 1300 కోట్ల కలెక్షన్ ని సొంతం చేసుకుని బాలీవుడ్ ని బీట్ చేసాయి. వాస్తవానికి బాలీవుడ్ లో కూడా గత ఏడాది మంచి సక్సెఫుల్ చిత్రాలు వచ్చినప్పటికీ ఓవరాల్ గా మన టాలీవుడ్ రేంజ్ కలెక్షన్ ని మాత్రం అందుకోలేకపోయాయి. కాగా టాలీవుడ్ చరిత్రలో తొలిసారిగా ఈ విధంగా టాలీవుడ్ పరిశ్రమ బాలీవుడ్ ని దాటి అత్యధిక రేంజ్ కలెక్షన్ అందుకుని సరికొత్త రికార్డు ని నెలకొల్పింది. మరి ఈ ఏడాదిలో రాబోవు మన తెలుగు సినిమాలు ఎంత స్థాయిలో సక్సెస్ ని కలెక్షన్ ని అందుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: