మెగా కాంపౌండ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆతరువాత కాలంలో తనకు తానుగా నిలదొక్కుకునే విధంగా తన సొంత ఇమేజ్ ని ఏర్పరుచుకోవడంలో పూర్తిగా సక్సస్ అవుతున్నాడు. ఒకవైపు చిరంజీవి భజన చేస్తూనే తన అభిమానులకు అల్లు ఆర్మీ అన్న పేరు పెట్టి ఏకంగా మెగా కాంపౌండ్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.


‘అల వైకుంఠపురములో’ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ ఈకరోనా పరిస్థితుల మధ్య ధైర్యంగా తన ‘పుష్ప’ ను విడుదల చేయడమే కాకుండా తన డ్రీమ్ అయిన పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ‘పుష్ప’ సక్సస్ తో బాలీవుడ్ నుండి కూడ అల్లు అర్జున్ కు ఆఫర్లు వస్తున్నాయి అంటే అతడి క్రేజ్ ఏస్థాయిలో ప్రస్తుతం ఉందో అర్థం అవుతుంది. ముఖ్యంగా బన్నీ తన పిఆర్ టీమ్ ను చాల జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.


సంక్రాంతి రేస్ కు రాబోతున్న దిల్ రాజ్ సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి మూవీ ‘రౌడీ బాయ్స్’ మూవీ ప్రమోషన్ ఫంక్షన్ కు బన్నీ అతిధిగా రావడమే కాకుండా ఆఫంక్షన్ లో బన్నీ ప్రవర్తించిన తీరు మెగా అభిమానులకు అసహనాన్ని కలిగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప’ మూవీతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఈ బిరుదు బ‌న్నీకి ఎవ‌రిచ్చార‌న్న విష‌యంలో సోష‌ల్ మీడియాలో అనేక సెటైర్లు కూడ పడ్డాయి. అయితే ఈవిషయాలను అల్లు అర్జున్ పట్టించుకోవడంలేదు. అంతేకాదు తన ఐకాన్ స్టార్ ట్యాగ్ ను మరింత పాపులర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు బ‌న్నీ సెల్ఫ్ ప్ర‌మోష‌న్ టాలీవుడ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


‘రౌడీ బాయ్స్’ ఈవెంట్ కు అతిధిగా వచ్చిన బన్నీ తాను వేసుకున్న టీష‌ర్ట్‌ తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. టీ ష‌ర్ట్ వెనుక ‘ఇది సార్ నా బ్రాండ్’ అనే ప‌దాల‌కు తోడు ఎరుపు రంగుతో ఉన్న చేతి ముద్ర క‌నిపించింది. ‘పుష్ప’ మూవీ క్లైమాక్స్‌లో బ‌న్నీ విల‌న్ ఫాహ‌ద్ ఫాజిల్‌ తో చెప్పే డైలాగ్ ఇది. ఈ  డైలాగ్‌ నే టీష‌ర్ట్ మీద ట్యాగ్‌ గా మార్చి రౌడీ బాయ్స్ ఈవెంట్లో హడావిడి చేయడం చూసిన మెగా అభిమానులు బన్నీ పూర్తిగా ‘మెగా’ అన్న పదాన్ని పూర్తిగా మర్చిపోయాడా అంటూ సెటైర్లు వేస్తూ అసహనానికి లోనవుతున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: