దానితో బాలీవుడ్ ను కించపరిచాడు మరియు తక్కువ చేసి మాట్లాడాడు అన్న విషయాలు ఎక్కవగా వినిపించాయి. అయితే ఈ విషయంపై అటు బాలీవుడ్ మరియు జాతీయ మీడియా మహేష్ ను ఉద్దేశించి ఏవేవో అంటోంది. కాగా ఈ విషయంపై ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత మహేష్ భట్ తనదైన రీతిలో స్పందించారు. ఈయన మాట్లాడుతూ... మహేష్ అన్న మాటలు నేను విన్నాను. అతను అన్న మాటలలో తప్పేమీ లేదు. బాలీవుడ్ మహేష్ ను భరిస్తుందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ముందే మహేష్ బాబు ఊహించడం చాలా గ్రేట్ అన్నారు. మహేష్ ను మెప్పించే విధంగా బాలీవుడ్ లేదు అనుకోవడంలో తప్పు లేదు అన్నారు. ఇంకా టాలీవుడ్ ను వదిలి రాను అన్న విషయం కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు..తాను ఎదిగిన సినిమా పరిశ్రమను ఆయన అంత గౌరవిస్తున్నాడు అని మనము అనుకోవడం మంచిది అని మాట్లాడారు మహేష్ భట్.
మహేష్ గురించి నేను విన్నాను...అతనికి ప్రజల్లో మంచి పేరుంది అంటూ కొనియాడారు. ఈ తరం హీరోలలో మహేష్ బాబు చాలా టాలెంటెడ్ అని మెచ్చుకున్నారు. మొత్తానికి ఈయన మాట్లాడిన తీరును బట్టి చూస్తే... బాలీవుడ్ సినిమాలో పసలేదని తానే స్వయంగా ఒప్పుకున్నాడు అని తెలుస్తోంది. అయితే ఈయన మాటలు విన్న నేటి తరం హీరోలు మరియు డైరెక్టర్ లు ప్రేక్షకులను మరియు ఇతర భాషల సినిమా పరిశ్రమ లను ఆకట్టుకునే సినిమాలను తీయాలని ఆకాంక్షిస్తున్నారు.