మూడు రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మేజర్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన మాటలు ఇంకా వివాదాలను సృష్టిస్తున్నాయి. అయితే తాను అన్నది ఒక యాంగిల్ అయితే.. ఈ మీడియా ఛానెళ్లు మరో విధంగా చూపిస్తూ బాలీవుడ్ కి టాలీవుడ్ కు అంతర్గత యుద్దమే పెట్టాయి. ఆ మీడియా కార్యక్రమంలో మాట్లాడిన మహేష్ బాబు బాలీవుడ్ లో సినిమా చేస్తారా అన్న ప్రశ్నకు... నేను టాలీవుడ్ లోనే సెటిల్ అయ్యాను.. ఇక్కడ ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూ ఉన్నారు. నేను ఎంత స్థాయికి వెళ్ళినా తెలుగు సినిమా నుండే వెళ్తాను అంటూ చెప్పాడు. అంతే కాకుండా బాలీవుడ్ లో సినిమా చేయను అక్కడ వాళ్ళు నన్ను భరించలేరు అని కూడా అన్నారు.

దానితో బాలీవుడ్ ను కించపరిచాడు  మరియు తక్కువ చేసి మాట్లాడాడు అన్న విషయాలు ఎక్కవగా వినిపించాయి. అయితే ఈ విషయంపై అటు బాలీవుడ్ మరియు జాతీయ మీడియా మహేష్ ను ఉద్దేశించి ఏవేవో అంటోంది. కాగా ఈ విషయంపై ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత మహేష్ భట్ తనదైన రీతిలో స్పందించారు.  ఈయన మాట్లాడుతూ... మహేష్ అన్న మాటలు నేను విన్నాను. అతను అన్న మాటలలో తప్పేమీ లేదు. బాలీవుడ్ మహేష్ ను భరిస్తుందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ముందే మహేష్ బాబు ఊహించడం చాలా గ్రేట్ అన్నారు. మహేష్ ను మెప్పించే విధంగా బాలీవుడ్ లేదు అనుకోవడంలో తప్పు లేదు అన్నారు.  ఇంకా టాలీవుడ్ ను వదిలి రాను అన్న విషయం కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు..తాను ఎదిగిన సినిమా పరిశ్రమను ఆయన అంత గౌరవిస్తున్నాడు అని మనము అనుకోవడం మంచిది అని మాట్లాడారు మహేష్ భట్.  

మహేష్ గురించి నేను విన్నాను...అతనికి ప్రజల్లో మంచి పేరుంది అంటూ కొనియాడారు. ఈ తరం హీరోలలో మహేష్ బాబు చాలా టాలెంటెడ్ అని మెచ్చుకున్నారు. మొత్తానికి ఈయన మాట్లాడిన తీరును బట్టి చూస్తే... బాలీవుడ్ సినిమాలో పసలేదని తానే స్వయంగా ఒప్పుకున్నాడు అని తెలుస్తోంది. అయితే ఈయన మాటలు విన్న నేటి తరం హీరోలు మరియు డైరెక్టర్ లు ప్రేక్షకులను మరియు ఇతర భాషల సినిమా పరిశ్రమ లను ఆకట్టుకునే సినిమాలను తీయాలని ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: