టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో ఒకరు అయినా అడవి శేషు గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ ఆ తర్వాత  క్షణం , గూడచారి , ఎవరు వంటి పలు సినిమా లలో హీరోగా నటించి ఆ సినిమా లతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ విజయాలను అందుకని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అడవి శేషు ప్రస్తుతం హిట్ 2, మేజర్ మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే అడవి శేషు హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల కాబోతోంది. మేజర్ మూవీ ని మహేశ్‌ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా వారు నిర్మించారు. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా మేజర్ సినిమా తెరకెక్కింది. ఇది ఇలా ఉంటే మేనేజర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో మే 9 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే మేజర్ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా ఓ అడవి శేషు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా అడవి శేషి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో అడవి శేషు మాట్లాడుతూ... చందమామ మూవీ లో ఒరిజినల్‌ హీరో నేను అని,  నవదీప్‌ స్థానంలో నేను చందమామ  మూవీ లో హీరోగా నటించవలసినది అని,  రెండు రోజుల షూటింగ్‌ తర్వాత ఆ మూవీ క్యాన్సిల్‌ అయింది అని  తాజా ఇంటర్వ్యూ లో అడవిశేషు తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: