స్టార్ సినిమా అంటే సెట్స్ మీదకు వెళ్లే టైం లో క్యాస్టింగ్ ఫైనల్ అయ్యే వరకు వాళ్లు ఉన్నారు వెళ్లు ఉన్నారు అంటూ ఒకటే హడావిడి జరుగుతుంది. వీటిలో కొన్ని వాస్తవాలు ఉంటే మరికొన్ని మాత్రం ఒట్టి రూమర్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఈమధ్య మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ మూవీలో సోనాలి బెంద్రే ఇంపార్టెంట్ రోల్ చేస్తుందని టాక్.

మహేష్ మురారి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె తారక్ సినిమాలో ఆంటీ రోల్ చేస్తుందా చెప్పండి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఆమె దాకా వేళ్లింది. దీనిపై ఆమె రెస్పాన్స్ కూడా అయ్యింది. తాను ప్రస్తుతం ఏ సినిమా చేయట్లేదని చెప్పేసింది సోనాలి. హీరోయిన్ గా తెలుగుతో పాటుగా హిందీలో కూడా టాప్ ప్లేస్ కు వెళ్లిన ఆమె ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలకు దూరమయ్యారు.

రీ ఎంట్రీ టైం లో క్యాన్సర్ బారిన పడటం దాని ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్లడం జరిగింది. నచ్చిన పాత్ర వస్తే మళ్లీ తెర మీద కనిపించేందుకు రెడీ అంటుంది సోనాలి బెంద్రే. అయితే తారక్ 30వ సినిమాలో మాత్రం తాను నటించట్లేదని. అసలు ఆ సినిమా టీం తనని కలవలేదని ముంబై మీడియాకి చెప్పింది. ఎన్.టి.ఆర్ 30వ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈమధ్యనే తారక్ బర్త్ డే సందర్భంగా సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క మళయాళంలో తప్ప అన్ని భాషల్లో తారక్ డబ్బింగ్ చెప్పడం విశేషం. 2023 సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. తప్పకుండా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు ఈ సినిమా అదిరిపోయే ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: