ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు భారీ సినిమాలను మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది నటీనటులకు కూడా ఎంపిక చేసుకోనున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా తప్పకుండా ఎన్టీఆర్ అభిమానులు భారీ స్థాయిలో మెప్పించే విధంగా ఉందని అంటున్నారు.

అయితే ఈ చిత్రాని కంటే ముందు కొరటాల శివ దర్శకత్వం చేసిన ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఆ సినిమా యొక్క ప్రభావం ఏమైనా ఈ సినిమా మీద ఉంటుందో అని ఎన్టీఆర్ అభిమానులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. అయితే దాని నుంచి కొరటాల బయటకు వచ్చి ఈ సినిమాను హిట్ చేయడం ఖాయమని వారిలో నే ఒక వర్గం కూడా చెబుతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది ఈ సినిమా. తప్పకుండా ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా అలరిస్తుంది అని చిత్ర యూనిట్ చెబుతుండడం విశేషం.

సినిమా మాత్రమే కాకుండా ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తో కలసి తన 31వ సినిమాను కూడా చేస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆ సినిమా యొక్క పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో క్లారిటీ ప్రేక్షకులలో వచ్చింది. మరి ప్రశాంత్సినిమా కోసం అసురుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నాడని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.  ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా నెగటివ్ గా ఉంటుంది అని చెబుతున్న నేపథ్యంలో ఈ పాత్ర ద్వారా ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: