బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. ప్రభాస్ రాన కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం కొన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో తెలుగు సినిమా ప్రపంచానికి చాటి చెప్పింది అని చెప్పవచ్చు. దీంతో ఈ చిత్రం తర్వాత స్టార్ హీరోల నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరో ల వరకు ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలలోనే నటించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన కన్నడ మూవీ కే జి ఎఫ్ సినిమా ఒకేసారి ఐదు భాషల్లో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది.

ఈ నేపథ్యంలో మెగా స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం rrrసినిమా మార్చి 25న విడుదల మంచి విజయాన్ని అందుకుంది ఇప్పటివరకు పోటీల్లో కూడా ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్టార్స్ సైతం చూసి ప్రశంసలు కురిపించారు ఈ చిత్రానికి ముందు థియేటర్ లో వచ్చిన రాధే శ్యామ్ చిత్రం కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమాకి రూ. 350 కోట్ల మేరకు బడ్జెట్ కేటాయించగా ఈ చిత్రం నష్టాలనే మిగిల్చింది గా తెలుస్తోంది.

కానీ కే జి ఎఫ్ -2  చిత్రం మాత్రం  బాలీవుడ్ లోనే రూ.400 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక గత సంవత్సరం పుష్ప సినిమా కూడా రూ.375 కోట్ల రూపాయలను వసూలు చేసింది. పాన్ ఇండియా చిత్రాల మోజులో పడి బడ్జెట్లో ఆకాశానికి పెరిగిపోతున్నాయి ఇక సినిమా టికెట్ల రేట్లు మేకర్స్ భారీగా పెంచేశారు దీంతో ప్రేక్షకులు ఎక్కువగా చిన్న సినిమాల కోసం థియేటర్లకు రాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే రాబోయే రోజులలో కేవలం పాన్ ఇండియా చిత్రాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు ప్రేక్షకులు చిన్న సినిమాలు కనుమరుగవుతాయి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: