నేచురల్ స్టార్ నాని మధ్యతరగతి నేపధ్యం నుండి రావడంతో అతడి మాటలలో మధ్య తరగతి కుటుంబ జీవన నేపధ్యం బాగా కనిపిస్తూ ఉంటుంది. క్రితం వారం విడుదలైన ‘అంటే సుందరానికి’ మూవీ విడుదల తరువాత ఆ మూవీకి డివైడ్ టాక్ రావడంతో ఆమూవీ ఫలితం పై నాని కొంతవరకు షాక్ అయ్యాడు.


అయితే ఆమూవీకి డివైడ్ టాక్ రావడంతో ఆమూవీ కలక్షన్స్ ఊహించిన స్థాయిలో లేకపోవడంతో మూవీ ఫెయిల్ అయింది అన్న వాస్తవాన్ని ఇప్పటికీ నాని అంగీకరించ లేకపోతున్నాడు. లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిషయమై నాని మాట్లాడుతూ తన ‘అంటే సుందరానికి’ మూవీ ‘కొత్త ఆవకాయ’ లాంటిదని కామెంట్స్ చేసాడు.


అంతేకాదు ఆవకాయ పెట్టినరోజు కంటే కొన్నిరోజులు గడిచేసరికి ఆ ఆవకాయ రుచి ఎలా పెరుగుతుందో తన లేటెస్ట్ మూవీ కూడ ఈవారం కలక్షన్స్ బాగుంటాయని నాని ఆశించాడు. అయితే అతడి ఆశలకు భిన్నంగా గడిచిన సోమవారం నుండి ఈ మూవీ కలక్షన్స్ తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకి తగ్గిపోతూ ఉండటంతో కొందరు నాని కామెంట్స్ ను ఆధారంగా తీసుకుని నాని కొత్త ఆవకాయ పచ్చడి రుచి తప్పిందా అంటూ సోషల్ మీడియాలో జోక్స్ వేస్తున్నారు.


వాస్తవానికి ఈ మూవీకి మొదటి మూడు రోజులు కలక్షన్స్ బాగానే వచ్చాయి. అయితే వీకెండ్ తరువాత ఈమూవీ కలక్షన్స్ రోజురోజు పడిపోవడం చూసినవారు నాని సినిమాలకు ప్రేక్షకులు దూరం అవుతున్నారా అన్న సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా కమలహాసన్ ‘విక్రమ్’ కలక్షన్స్ వర్కింగ్ డేస్ లో కూడ కలక్షన్స్ వస్తున్న పరిస్థితులను బట్టి సినిమా బాగుంటే జనం వీకెండ్స్ లో మాత్రమే కాకుండా వర్కింగ్ డేస్ లో కూడ బాగా వస్తారు అన్న విషయాన్ని మరొకసారి రుజువు చేస్తోంది. ఇప్పుడు నాని త్వరలో విడుదల కాబోతున్న ‘దసరా’ మూవీ పైనే తన ఆశలు పెట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: