నాచురల్ స్టార్ నాని తాజాగా అంటే సుందరానికి మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా కథానాయికగా నటించింది. ఈ సినిమాకు మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా సినిమాలకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నా అంటే సుందరానికి మూవీ ని జూన్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. థియేటర్లో విడుదల అయిన మొదటి షో కే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాస్త మిక్సడ్ టాక్ ను సొంతం చేసుకుంది. సెకండాఫ్ ఫుల్ స్పీడ్ గా ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ మాత్రం కాస్త స్లో అయ్యింది అని నెగటివ్ కామెంట్స్ ఈ మూవీకి వచ్చాయి.  అయినప్పటికీ ఆ నెగిటివ్ టాక్ ప్రభావం ఏమాత్రం చూపించకుండా మూవీ మొదటి వారం రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది.  ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి మూవీ వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.

నైజాం: 5.58 కోట్లు .
సీడెడ్ : 1.13 కోట్లు .
యూ ఎ : 1.33 కోట్లు  .
ఈస్ట్ : 93 లక్షలు .
వెస్ట్ : 79 లక్షలు .
గుంటూర్ : 87 లక్షలు .
కృష్ణ : 84 లక్షలు .
నెల్లూర్ : 58 లక్షలు .
వారం రోజులకు గాను అంటే సుందరానికి మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.05 కోట్ల షేర్ , 20.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది.


కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.34 కోట్లు .
ఓవర్ సీస్ లో : 5.00 కోట్లు .
వారం రోజులకు గాను అంటే సుందరానికి మూవీ ప్రపంచవ్యాప్తంగా 18.39 కోట్ల షేర్ , 32.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: