అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులకే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకుడిగా ఈ సినిమాకి వహిస్తున్నారు. ఈ సినిమా నుండి అఖిల్ ఇప్పటికే విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి అయిన సాక్షి వైద్య నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే..

హీరోయిన్ తాప్సీ నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్రంలో.. కానీ ఇప్పటివరకు ఇందుకు సంబంధించి ఎలాంటి పోస్టర్ కూడా విడుదల చేయలేదు. కానీ ఈ రోజు ఈమె పుట్టినరోజు సందర్భంగా ఎట్టకేలకు చిత్ర బృందం ఆమె పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. సాక్షి వైద్య టాలీవుడ్లో హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పోస్టర్లు చూస్తుంటే మనకి అర్థమవుతుంది. చూడగానే ఒక ప్రశ్న తో పాటు ఆకర్షించే అందం తో ఉన్నట్లు పలువురు నటీనటులు కామెంట్ చేస్తున్నారు.
సరైన జోడి దొరికినట్లుగా ఈ అమ్మడిని చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక అభిమానులు కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు అఖిల్ మరియు సాక్షి వైద్యాల కాంబినేషన్లో వస్తున్న ఈ రొమాంటిక్ చిత్రంలో సన్నివేశాలు ఈ సినిమాకి బాగా ఆకర్షణీయంగా ఉంటాయి అని అభిమానులు ఆశిస్తున్నారు. హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూసిన తర్వాత ఈమెకు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సినీ ప్రేక్షకుల నుండి టాక్ వినిపిస్తోంది. సాక్షి అందంతో పాటు మంచి ఫిజిక్ ని కలిగి ఉండడంతో భవిష్యత్తు లో టాప్ హీరోయిన్ గా చేరుతుందో లేదో చూడాలి మరి. దీంతో హీరోయిన్ పై క్లారిటీ వచ్చింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: