బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ హిందీ మూవీ ల ద్వారా ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ను , ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కరీనా కపూర్ లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీ లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. 

మూవీ లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించగా, ఆయన ప్రేయసి పాత్రలో కరీనా కపూర్ కనిపించబోతోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ప్రివ్యూ ని  మెగాస్టార్ చిరంజీవి , అక్కినేని నాగార్జున , అక్కినేని నాగ చైతన్య , ఎస్ ఎస్ రాజమౌళి , సుకుమార్ ...  అమీర్ ఖాన్ తో కలిసి చూపిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవిసినిమా నుండి కరీనా కపూర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని  మీకు పరిచయం చేస్తున్నాను...వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క  మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’. అంటూ రాసుకొచ్చారు.

సినిమా హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ తో నాగ చైతన్య హిందీ ఇండస్ర్టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాను ఆగస్ట్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: