నందమూరి పెద్ద వారసుడు హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ ఫిక్షనల్ సినిమా బింబిసార..ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.ఇక ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా ఇంకా అలాగే వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా ఓ మంచి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.కళ్యాణ్ రామ్ ఎప్పుడు ట్రై చేయని సరికొత్త గెటప్ లో కనిపించే సరికి ఈ సినిమాపై ముందు నుండే చాలా ఇంట్రెస్ట్ పెట్టారు. క్రీస్తు పూర్వం నాటి మగధ మహారాజు బింబిసారుడు కథాంశంతో ఆసక్తికరంగా నూతన డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇక ఈ సినిమాని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తనవంతు సహాయంగా ప్రొమోషన్స్ చేసి ప్రేక్షకులకు మరింత చేరువ చేసాడు.ఇక ఈ సినిమా ఆ తర్వాత కూడా వసూళ్ల పరంపర ను కొనసాగిస్తుంది.


రెండు రోజుల్లోనే చాలా కూడా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గలు చెబుతున్నాయి. ఇంకా అలాగే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నైజాం లో రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ మార్క్ కు దగ్గర అయ్యిందట.ఇక ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పోయింది.. ఫస్ట్ డేనే బెస్ట్ ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. అలాగే ఈ సినిమా నైజాం లో 4 కోట్ల బిజినెస్ చేసింది.. విడుదల అయినా రెండువ రోజు జి ఎస్ టి తో కలిపి మొత్తం 1.77 కోట్ల షేర్ రాబట్టగా రెండు రోజుల్లోనే 3.87 కోట్ల మార్క్ టచ్ చేసింది. దీంతో ఆల్ మోస్ట్ ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినట్టే అని కూడా చెప్పాలి. ఈ రోజు సండే కాబట్టి మరింత వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.. ఇక ఈ రోజు నుండి నైజాం ఏరియాలో లాభాల బాట పెట్టనున్నట్టు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: