టాలీవుడ్ యంగ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' మూవీ ఇటీవల థియేటర్ లలో రిలీజ్ అయ్యి చాలా దారుణాతి దారుణంగా అట్టర్ ప్లాపైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షోకే డిజాస్టర్ అని సినిమా చూసిన ప్రేక్షకులు తేల్చేశారు.టాలీవుడ్ మాజీ హీరోయిన్ ఛార్మి, ఇంకా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ లతో కలిసి పూరి కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో ఈ మూవీ పర్వాలేదు అనిపిస్తుంది. అక్కడ ఈ మూవీ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.కానీ మిగిలిన అన్ని వెర్షన్లలో ఈ మూవీ భారీ నష్టాలు మిగల్చడం గ్యారెంటీ అని తేలిపోయింది. దాదాపు రూ.50 కోట్ల వరకు ఈ మూవీ నష్టాలు మిగిల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూరి ఈ చిత్రం కోసం పారితోషికంతో పాటు లాభాల్లో వచ్చిన వాటాలో కూడా రూ.70 శాతం వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తుంది.


తాజాగా విజయ్ దేవరకొండ కూడా తన వంతు పారితోషికం వెనక్కి ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.'లైగర్' కోసం విజయ్ దేవరకొండ కి రూ.15 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేశారు. అంతేకాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ లో వాటా కూడా ఉంది. మొత్తంగా అతని పారితోషికం విలువ రూ.20 కోట్లని తెలుస్తుంది. ఇందులో విజయ్ రూ.6 కోట్ల వరకు వెనక్కి ఇచ్చేసినట్టు సమాచారం తెలుస్తుంది. లాభాల్లో వాటా ఇంకా అతనికి ఇవ్వలేదట. అది ఇప్పుడు వద్దు అని విజయ్.. పూరి, ఛార్మి లతో అన్నట్టు సమాచారం తెలుస్తుంది.విజయ్ తన తరువాత మూవీ 'జన గణ మన' కూడా పూరి ఛార్మి లతోనే చెయ్యాలి. ఒకవేళ ఆ సినిమా సక్సెస్ సాధిస్తే అప్పుడు విజయ్ లాభాల్లో వాటా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది విజయ్ నటిస్తున్న 'ఖుషి' సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: