నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా యొక్క ప్రభావం ఇప్పుడు ఆయన తదుపరి సినిమాలపై పడుతుంది వరుస పరాజయాలతో ప్రేక్షకులను ఎంతో నిరాశపరిచిన నిఖిల్ చాలా రోజుల తర్వాత కార్తికేయ2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు హిందీ ప్రేక్షకులను కూడా అలరించిన ఈ హీరో ఇప్పుడు తన తదుపరి సినిమా కూడా అదే స్థాయిలో ఉండే విధంగా మార్పులు చేర్పులు చేయాలని దర్శక నిర్మాతలకు సూచిస్తున్నాడు.

 అందులో భాగంగానే సుకుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న 18 పేజెస్ సినిమాకు సంబంధించి సినిమాలో మార్పులు చేస్తే బాగుంటుంది అనేది నిఖిల్ సూచిస్తున్నాడట. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేసి మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన చెబుతున్నాడట మరి paan ఇండియా మార్కెట్ ఏ విధంగా ఉంటుందో సుకుమార్ కు బాగా తెలిసిన విషయం. తప్పకుండా ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా వైడ్ గా విడుదల చేస్తే మంచి పేరు వస్తుంది అ ని సుకుమార్ కు తెలుసు.

 ఈ సినిమాకు ఆయన దర్శకుడిgaa కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి మంచి లాభాలను పొందాలం టే ఈ సినిమాను ఆ స్థాయిలో రూపొందించాల్సిందే. ఇక నిఖిల్ ఈ సినిమాను మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ చిత్రం పై మరింత బజ్ పెరిగే విధంగా ఆయన మరికొన్ని మార్పులు సూచిస్తున్నాడట. మరి ఈ రెండు సినిమాలు ఆయనను ఏ స్థాయి హీరోగా మారుస్తుందో చూడాలి. ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ నుండి సినిమాలన్నీ కూడా హిందీ మార్కెట్లో కూడా మంచి విజయాలను అందుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఫ్యాన్ ఇండియా స్థాయిలో అందరిని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: