మెగాస్టార్ చిరంజీవి ప్రతిభ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో చిరంజీవి అంతకంతకూ ఎదిగారు.


150కు పైగా సినిమాలలో నటించిన చిరంజీవి ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు హీరోగా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించి ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది.

ఈ మధ్య కాలంలో ఈటీవీ ఛానల్ లోని షోల ద్వారా కండక్టర్ ఝాన్సీ ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఝాన్సీకి సినిమాలలో, టీవీ షోలలో ఆఫర్లు వస్తుండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. కొంతమంది ఆమె గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా మెజారిటీ ప్రేక్షకులు మాత్రం ఆమె పర్ఫామెన్స్ ను తెగ మెచ్చుకుంటున్నారు. ఆఫర్లు పెరగడం వల్ల ఝాన్సీ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని బోగట్టా.

ఝాన్సీ ఒకవైపు కండక్టర్ గా పని చేస్తూనే మరోవైపు డ్యాన్సర్ గా కెరీర్ ను కొనసాగించడం గమనార్హం.

ఝాన్సీ మాట్లాడుతూ టీవీ ఛానెళ్ల లో నా తొలి పర్ఫామెన్స్ జీ తెలుగులో ఇచ్చానని ఆ తర్వాత జెమినీ డ్యాన్సింగ్ స్టార్ లో నేను చేశానని ఆమె చెప్పుకొచ్చారు. అప్పుడు నాకు ఫస్ట్ ప్లేస్ రావడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ దక్కిందని తెలిపారు.
చిరంజీవిగారు నా ప్రతిభను మెచ్చుకోవడంతో పాటు డ్యాన్స్ ను ఆపొద్దని కంటిన్యూ చేయాలని సూచించారని సందె పొద్దుల కాడ అనే సాంగ్ కు చిరంజీవి సొంతంగా కొరియోగ్రఫీ చేసుకున్నారని ఈ విషయాన్ని స్వయంగా ఆయన చెప్పారని ఝాన్సీ చెప్పుకొచ్చారు. ఝాన్సీ ద్వారా చిరంజీవి గురించి అభిమానులకు తెలియని ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.దీనితో చిరు అభిమాను లు హర్షం వ్యక్తం చేసారు..

మరింత సమాచారం తెలుసుకోండి: