తమిళ ‘బాహుబలి’ అంటూ కోలీవుడ్ మీడియాలో విపరీతంగా ప్రచారాన్ని పొందుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ పై మణిరత్నం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈమూవీని 4వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీయడం ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చోళరాజుల చరిత్రను ఆధారంగా తీసుకుని నిర్మింపబడ్డ ఈమూవీ మణిరత్నం డ్రీమ్.


ఈమూవీలో భారీ తారాగణం నటిస్తున్నప్పటికీ ప్రస్తుత తరం ప్రేక్షకులలో పెద్దగా ఇమేజ్ లేని త్రిష ఐశ్వర్యా రాయ్ లను కూడ ఈమూవీలో కీలక పాత్రలలో మణిరత్నం ఎంపిక చేసాడు. ఈసినిమా కథ రీత్యా త్రిష ఐశ్వర్యా రాయ్ ల పాత్రలు చాల కీలకమే కాకుండా వారు నటించిన పాత్రలు చాల సీరియస్ గా ఉంటాయట.


అయితే షూటింగ్ సీన్ లోకి ఎంటర్ అయిన తరువాత వీరిద్దరూ తమ పాత్రలకు అనుగుణంగా నటిస్తున్నప్పటికీ షూటింగ్ గ్యాప్ లో వీరిద్దరూ స్నేహితులు కావడంతో ఎప్పుడు నవ్వుతూ ఒకరి పై ఒకరు జోక్స్ వేసుకుంటూ షూటింగ్ ను ఎంజాయ్ చేసారట. అయితే ఈవిషయం మణిరత్నం కు నచ్చకపోవడంతో వారిద్దరూ తమ పాత్రలకు ఎక్కడ న్యాయం చేయలేకపోతారో అన్నభయంతో తరుచూ వీరిద్దరి పై చికాకుపడుతూ ఉండేవారట. అయితే మణిరత్నం చికాకును వారిద్దరూ పట్టించుకోక పోవడంతో వారిద్దరి పై ఒకటికి రెండుసార్లు షూటింగ్ స్పాట్ లో వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడ ఉన్నాయట. ఈ విషయాన్ని మణిరత్నం ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు.


ఇది ఇలా ఉంటే ఈమూవీ ప్రమోషన్ తెలుగులో బాగా చేస్తున్నప్పటికీ ఈ మూవీ గురించి తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం చోళరాజుల చరిత్ర గురించి పెద్దగా అవగాహన లేకపోవడం అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో మణిరత్నం కలలను ఎంతవరకు ‘పొన్నియన్ సెల్వన్’ తీర్చగలుగుతుంది అన్న సందేహాలు ఉన్నప్పటికీ ఎదో ఒక మ్యాజిక్ ఈమూవీలో ఉంటుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: