ఈవారం విడుదలకాబోతున్న మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ మూవీ పై తెలుగు రాష్ట్రాలలో భారీ అంచనాలు లేకపోయినప్పటికీ ఆమూవీకి తమిళనాడులో ఏర్పడిన క్రేజ్ ను గమనించిన వారు ఈవిషయంలో తెలుగు ప్రేక్షకులు తమిళ ప్రేక్షకుల నుండి చాల పాఠాలు నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు మణిరత్నం నుండి సరైన హిట్ వచ్చి దాదాపు దశాబ్ద కాలం గడిచిపోయింది.


దీనితో మణిరత్నం హవా అయిపోయింది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితులలో మణిరత్నం తన 65 సంవత్సరాల వయసులో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ గురించి ఎంతో రీసర్చ్ చేయడమే కాకుండా ఈమూవీ తీసే విషయంలో సుమారు మూడు సంవత్సరాలు తన విలువైన కాలాన్ని ఈ మూవీ ప్రాజెక్ట్ పై పెట్టాడు. వాస్తవానికి మణిరత్నం ఈమూవీ ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు ఈమూవీలోని ఒక కీలక పాత్రను రామ్ చరణ్ తో కానీ లేదంటే మహేష్ తో కాని చేయించాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడని అంటారు.


అయితే ఆప్రయత్నాలు ఫెయిల్ అయినప్పటికీ తమిళ ఫిలిం ఇండస్ట్రీ అంతా మణిరత్నం వెనక ఉండి తమకు ఎంతో గర్వకారణం అయిన చోళరాజుల చరిత్ర ప్రపంచానికి తెలియాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీలో తమిళ టాప్ హీరోలు అంతా తమ పారిపోతోషిక విషయాలను పక్కకు పెట్టి తమిళ చరిత్ర అందరికీ తెలియాలి అన్న ఆలోచనలతో ఈమూవీ ప్రాజెక్ట్ లో నటించి మణిరత్నం కలలను నిజం చేసారు అని అంటారు.


అయితే 2017లో వచ్చిన బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెలుగు ప్రజల చరిత్రకు సంబంధించింది అయినప్పటికీ ఆమూవీ పై పెద్దగా మ్యానియా ప్రదర్శించకుండా ఆమూవీతో పోటీగా విడుదలైన ‘ఖైదీ నెంబర్ 150’ కి కోట్లు కురిపించారు. వాస్తవానికి తెలుగు ప్రజల క్యాలెండరు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కాలం నుండి ప్రారంభం అయింది. ఇలాంటి తెలుగు చరిత్రకు సంస్కృతికి సంబంధించిన గౌతామీపుత్ర శాతకర్ణి కి అప్పట్లో ఏర్పడిన మ్యానియాతో పోల్చుకుంటే ‘పొన్నియన్ సెల్వన్’ కు ఏర్పడిన మ్యానియాతో పోల్చుకుంటే తెలుగు ప్రేక్షకులు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కి సరైన గుర్తింపు ఇవ్వలేదా అన్న సందేహాలు కూడ కొందరిలో ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: