మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" మూవీ తో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు  ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ తెలుగు మరియు హిందీ భాషలలో ఒకే రోజు విడుదల అయింది. ఈ మూవీ కి తెలుగు తో పాటు హిందీ నుండి కూడా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఈ సినిమా కలెక్షన్ లకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ని ప్రకటించింది.  తాజాగా ఈ మూవీ యూనిట్ గాడ్ ఫాదర్ మూవీ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇలా మెగాస్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ తో 100 కోట్ల కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర సాధించాడు. గాడ్ ఫాదర్ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా , సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ , నయన తారమూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: