మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ ఉన్నారు. యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తున్నారు. అక్టోబర్ 5న విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టిన చిరంజీవి త్వరలో వాల్తేరు వీరయ్యగా రాబోతున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ టీజర్ ను ఇటీవల విడదల చేసి మంచి హైప్ క్రియేట్ చేశారు మూవీ మేకర్స్. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు వీరిద్దరి మధ్య జరిగే ఓ సీన్ లీక్ కాగా ఇప్పుడు సినిమాలో విరిద్దరికి సంబంధించిన ఒక అప్డేట్ క్యూరియాసిటీని పెంచుతోంది.


మాస్ ఎలిమెంట్స్‌తో..
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా నటిస్తున్న మూవీకి వాల్తేర్ వీరయ్యగా టైటిల్ ఖారారు చేశారు. ఎప్పటి నుంచో ఈ టైటిల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల నోట నానుతున్న ఈ టైటిల్‌తోనే మైత్రీ మూవీ మేకర్స్ ముందుకు వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా ఇటీవల టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఈ టీజర్ మాస్ ఎలిమెంట్స్‌తో అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మాస్ ఎలిమెంట్స్‌తో ఉన్న చిరంజీవి వాల్తేరు వీరయ్యకు మాస్ మహారాజ్ రవితేజ ఫైనల్ టచ్ ఇచ్చి హైప్ క్రియేట్ చేశాడు. టీజర్ ఎండింగ్‌లో రవితేజ.. హ్యాపీ దీవాళీ.. తొందర్లోనే కలుద్దాం అంటూ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ తెప్పించాడు.

చిరు, రవితేజ కలిసి స్టెప్పులు..

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా నటిస్తున్నరని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.ఇదివరకు చిరంజీవిని రవితేజ అరెస్ట్ చేసి తీసుకెళ్లే సీన్ అనుకోకుండా సోషల్ మీడియాలో లీక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. చిరంజీవి, రవితేజలపై ప్రత్యేకంగా ఓ సాంగ్ చిత్రీకరించబోతున్నారట. అంటే చిరు, రవితేజ కలిసి స్టెప్పులు వేయనున్నారన్న మాట.

సుమారు 22 ఏళ్ల తర్వాత..చిరంజీవి, రవితేజ ఒక స్పెషల్ సాంగ్ లో కలిసి నర్తించడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. గతంలో శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో ఒక పాటలో డ్యాన్స్ వేశారు. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ కు మెగా మాస్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఇక ఈ సాంగ్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బీట్ సిద్ధం చేసినట్లు సమాచారం.

ఈ ప్రత్యేక పాటకు ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేయనున్నారు. కాగా చిరంజీవి, రవితేజ కలిసి అన్నదమ్ములుగా ఇదివరకు నటించిన చిత్రం అన్నయ్య. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రంలో అన్నదమ్ములుగా వీరిద్దరి నటనను అంత త్వరగా మర్చిపోలేం. ఇప్పుడు సుమారు 22 ఏళ్ల తర్వాత చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా నటించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: