పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాలంగా ఆయన ఒక అదిరిపోయి రేంజ్ విజయాన్ని అందుకోవాలి అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ , సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమాలో హీరో గా నటించాడు. ప్రియాంక అరుల్ మోహన్మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పై మొదటి నుండి పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల అయింది.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన వారం రోజులు బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 44.66 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 14.25 కోట్లు , ఉత్తరాంధ్ర లో 12.96 కోట్లు , ఈస్ట్ లో 11.01 కోట్లు , వెస్ట్ లో 7.09 కోట్లు , గుంటూరు లో 9.80 కోట్లు , కృష్ణ లో 8.54 కోట్లు , నెల్లూరు లో 3.95 కోట్లు , కర్ణాటక లో 9.20 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.5 కోట్లు , ఓవర్ సిస్ లో 30.95 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మొత్తంగా వారం రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 156.56 కోట్ల షేర్ ... 257.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 172.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 174 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ మరో 17.04 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని అందుకుని చాలా కాలం అవుతుంది. దానితో ఓజి మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను ఇప్పటికే వసూలు చేయడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: