విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన మనసులో మాటను ఏదీ దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటాడు. జీవితంలో తనకు నటించడం రాదు అంటూ అనేకసార్లు చెప్పాడు. తమిళ తెలుగు కన్నడ హిందీ సినిమాలలో అనేక పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్ కు ప్రస్తుతం పూర్వ స్థాయిలో అవకాశాలు ఇవ్వడం లేదు అన్నప్రచారం జరుగుతోంది.



విభిన్నమైన పాత్రలను చాల సులువుగా పోషించగల ఇలాంటి నటుడుని ఎందుకు పట్టించుకోవడంలేదు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఈవిషయమై ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాను ప్రధానమంత్రి మోడీని వ్యతిరేకిస్తూ చేస్తున్న కామెంట్స్ వల్ల కొందరు భయపడి తనతో నటించడానికి వెనకడుగు వేస్తున్నారేమో అన్న సందేహం తనకు కలుగుతోంది అంటూ కామెంట్స్ చేసాడు.



అదే నిజం అయితే సినిమాలలో అవకాశాల కోసం తన అభిప్రాయాలు మార్చుకోనని తన రాజకీయ అభిప్రాయాలు వల్ల ఎవరైనా తనతో నటించడానికి ఇష్టపడకపోతే వారిని వదులుకుంటాను కానీ తన అభిప్రాయాలలో రాజీపడను అంటూ కామెంట్స్ చేసాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో గ్రూపులు ఉండేవని ఇప్పుడు తనకు గ్రూపులు కనిపించడం లేదు అంటూ ప్రతిభ ఉంటే ఓటీటీ లలో వెబ్ సిరీస్ లు తీసి కూడ రాణించవచ్చు అంటూ కామెంట్స్ చేసాడు.



ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్న ప్రకాష్ రాజ్ వచ్చే ఎన్నికలలో తెలంగాణ నుండి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తాడు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ ప్రజలు కన్నడ ప్రాంతానికి చెందిన ప్రకాష్ రాజ్ ను నమ్మి ఓట్లు వేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా టాప్ హీరోల సినిమాలలో ప్రకాష్ రాజ్ కు అవకాశాలు తగ్గాయి అన్నది వాస్తవం. అనేకమంది పరభాషా విలన్స్ తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇస్తున్న పరిస్థితులలో ప్రకాష్ రాజ్ ను పక్కకుపెట్టి వెరైటీ కోసం కొత్తకొత్త విలన్స్ ను ట్రై చేస్తున్నారు అనిపిస్తోంది..


 


మరింత సమాచారం తెలుసుకోండి: