తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వారిసు'. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా ఇంకా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ సినిమాలో విజయ్ లుక్స్ పరంగా ఇంకా అలాగే పర్ఫార్మెన్స్ పరంగా కూడా సినిమాను ఖచ్చితంగా మరో లెవెల్‌కు తీసుకెళ్తాడని చిత్ర యూనిట్  ఎంతగానో ధీమా వ్యక్తం చేస్తోంది.సంక్రాంతి పండుగ బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, వారిసు సినిమాని తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వారిసు సినిమాకి హిందీలో ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అని అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.


కాగా, ఈ సినిమాకు హిందీలో 'వారిస్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే విజయ్ కి యాంటి ఫ్యాన్స్  అలాగే కొంతమంది నెటిజనులు వారిసు హిందీ విడుదల పై తెగ ట్రోల్  చేస్తున్నారు. బీస్ట్ సినిమా విషయంలో అక్కడ సినిమాని విడుదల చేసి ట్రోల్  అయ్యారు. ఇప్పుడు కూడా అవసరమా. ముందు తెలుగు తమిళంలో హిట్టయ్యాక అప్పుడు విడుదల చెయ్యొచ్చుగా అంటూ ట్రోల్  చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ పాత్ర అల్టిమేట్‌గా డిజైన్ చేశాడట దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ సినిమాలో అందాల భామ కుర్ర బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు ఎస్  ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సినిమా పై చిత్ర బృందం చాలా నమ్మకంగా వున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఏ విధంగా మెప్పిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: