భారతదేశంలో రోజు రోజుకి జనాభా పెరిగిపోతున్న తరుణంలో ఈ జనాభాకు ఆహారాన్ని అందించే రైతులు మాత్రం రోజురోజుకూ తగ్గిపోతున్నారు.. పెట్టుబడి ఎక్కువ పైగా లాభాలు తక్కువ.. అందుకే రైతులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపడం లేదు. 2050 సంవత్సరం నాటికి భారతదేశ జనాభా 1.64 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.. ఇంత మంది జనాభాకు ఆహారాన్ని మూడు పూటలా అందించాలంటే సాధ్యం అవుతుందా..? అయితే ఇది ఒక పెద్ద సవాలే అని చెప్పవచ్చు.. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కారణంగా ప్రతిరోజూ మనం వ్యవసాయ యోగ్యమైన భూమి ని కోల్పోతూ వస్తున్నాము..


ఇక ఇవన్నీ చూసినట్లయితే మనకు ఫ్యాక్టరీలలో పండ్లు, కూరగాయలు పండించే విధానం కూడా దగ్గర్లోనే వస్తుందేమో అని అనిపిస్తుంది.. ఇక ఇవన్నీ ఆలోచించిన తర్వాత కూడా అభివృద్ధి చెందిన దేశాలలో ముఖ్యంగా ఇజ్రాయేల్ టెక్నాలజీ బాగా ఆదరణ లోకి వచ్చింది.. ఇక దీనినే మనం వర్టికల్ ఫార్మింగ్ అని అంటాము.. అంటే ఉన్న స్థలంలోనే ఎక్కువ పంటలు పండించవచ్చు. దీని ద్వారా బంజరు భూములలో కూడా వ్యవసాయం చేయవచ్చు.. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలో పసుపు వర్టికల్ ఫార్మింగ్ ను ప్రారంభించారు.


అయితే ఈ ఫార్మింగ్ కోసం ఏం చేయాలి అంటే.. ఒక రకమైన షెడ్డు లో.. ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితుల ప్రతికూల ప్రభావం నుంచి పంటను మనం రక్షించుకోవాల్సి ఉంటుంది.. దీనికోసం గ్రీన్ హౌస్ ను ఏర్పాటు చేయాలి. ఇక పసుపు పంట విషయానికి వస్తే.. గ్రీన్ హౌస్ లో నేలను ఒక క్రమపద్ధతిలో చదును చేసి గాల్వనైజ్డ్ ట్రే సిస్టం ఏర్పాటు చేసి అందులో పసుపు మొక్కలు నాటాల్సి ఉంటుంది.. ఒక షెడ్డ్యులో 4 నుంచి 5 వరుసలు ఉండే కుండీలు , ట్రేలను ఏర్పాటు చేసి అందులో చిన్న చిన్న డబ్బాలో పెట్టి వాటిలో ఈ పసుపు మొక్కలు పెంచవచ్చు. వీటికి డ్రిప్ సిస్టం ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. ఈ టెక్నిక్ ని గనుక మీరు ఉపయోగించినట్లయితే ఒక ఎకరం సాగులో వందెకరాల ఉత్పత్తిని పొందవచ్చు. ఇలా చేయడం వల్ల సుమారు 2.5 కోట్ల రూపాయలు కూడా సంపాదించవచ్చు అని మహారాష్ట్రలో జరిపిన ఒక సాగులో నిరూపితమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: