ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఖర్చు ఎక్కువ అని ఆలోచించే తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో కూడా ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు.. అందుకే ఆడ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎంతో మంది తల్లిదండ్రులు మొదటినుంచి డబ్బు పోగు చేయడం మొదలు పెడుతున్నారు. ఆడ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా కేవలం ఆడపిల్లలకు మాత్రమే ఒక సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ఇక ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వలన అమ్మాయి అవసరాలకు ఏకంగా 71 లక్షల రూపాయలు చేతికి వస్తాయి. అయితే అది ఎలాగో ఇప్పుడు చదివి తెలుసుకుందాం..


ఆడపిల్లలకు భవిష్యత్తులో ఆర్థిక భరోసా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. బేటీ పడావో.. బేటీ బచావో.. కార్యక్రమంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం 2015 జనవరి 22వ తేదీన ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం 7.60 శాతం వడ్డీ రేట్లను కూడా ఆఫర్ చేస్తోంది. దేశీయ దిగ్గజం అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు పలు బ్యాంకులలో ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఎవరైనా సరే ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు ఆడపిల్ల పేరు పైన ఇందులో అకౌంట్ తెరవచ్చు.


ఇందులో ఖాతా తెరవడానికి ఆడపిల్ల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రులకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ తో పాటు ఐడి ప్రూఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ అకౌంట్ తెరిచేటప్పుడు 250 రూపాయలను వెచ్చించి డిపాజిట్ చేసి ఖాతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ తెరియడానికి ఆన్లైన్ సదుపాయాలు అయితే లేవు కాబట్టి నేరుగా బ్యాంకు కు వెళ్లి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల కాల పరిమితి ఉన్న ఈ పథకంలో  డబ్బులు జమ చేయడం వల్ల ఏకంగా రూ.71 లక్షలు అమ్మాయి చేతికి లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: