ఇందుకోసం సర్టిఫైడ్ యోగా ట్రైనర్ గా మీరు మారి ప్రతినెలా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. నేడు ప్రపంచ యోగా దినోత్సవం కారణంగా యోగా ట్రైనర్లకు కూడా డిమాండ్ బాగా పెరిగింది అని చెప్పాలి. ముఖ్యంగా స్కూల్స్, ఆసుపత్రులు, కాలేజీలు, కార్పొరేట్ ఆఫీస్లు, సెలబ్రిటీలు ఇలా చాలా చోట్ల యోగా ట్రైనర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. పలువురు ఉన్నత వర్గానికి చెందిన వారు కూడా పర్సనల్ యోగ ట్రైనర్లను నియమించుకుంటున్నారు. ఇక మీరు కూడా యోగాని కెరియర్ ఆప్షన్ గా ఎంచుకొని డబ్బు పొందవచ్చు.
ముఖ్యంగా న్యాచురోపతి ఇన్స్టిట్యూట్ లలో యోగా డిప్లమా తరగతులను నిర్వహిస్తున్న నేపథ్యంలో మీరు యోగా ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికెట్ పొందడం ద్వారా మీరు యోగా ట్రైనర్ గా మారి మంచి ఆదాయం పొందవచ్చు.అన్ని స్కూల్స్, కాలేజీల్లో కూడా ఇప్పుడు యోగా ట్రైనర్లను నియమించుకుంటున్న నేపథ్యంలో మీరు యోగా ట్రైనర్ అయితే కచ్చితంగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ ప్రారంభించి కూడా మీరు ట్రైనింగ్ క్లాసులను నేర్పించవచ్చు. కొద్దిగా పెట్టుబడి పెట్టి యోగా శిక్షణ పొందిన తరువాత విదేశాలలో కూడా ఉద్యోగ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. యోగా ట్రైనర్ గా మీరు మారి అమెరికా , యూరప్ వంటి దేశాలలో మంచి ఉద్యోగం సంపాదించి భారీగా డబ్బు పొందే అవకాశం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి