పరిశ్రమలో అందరిచేత గౌరవించబడే అనుష్కకు కెరీర్ బిగినింగ్ లో వేధింపులు తప్పలేదట. తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని అనుష్క క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట్లో అనుష్కను అవకాశాలు కోసం కొందరు దర్శక నిర్మాతలు కమిట్మెంట్ అడిగారట. ముక్కుసూటిగా ఉండే అనుష్క అలాంటి వారికి దూరంగా ఉంటూ వేధింపుల నుండి తప్పించుకుందట. ఈ విషయాలన్నీ తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు.