అల వైకుంఠపురం వంటి మంచి హిట్ తర్వాత అల్లు అర్జున్ తదుపరి చిత్రం కావడం, అందులోనూ ఆర్య వంటి సూపర్ సినిమాను బన్నీ కి గిఫ్ట్ ఇచ్చిన సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం... వంటి అంశాలు పుష్ప సినిమాకు మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అందులోనూ లాక్ డౌన్ సమయం కావడంతో.... పుష్ప సినిమా ట్రెండింగ్ భారీగానే కనిపించింది.