తాజాగా ఈ విమర్శల దర్శకుడిని ఇష్టపడే ఓ యువ రచయిత రేఖ పర్వతాల తాజాగా ‘వర్మ’పై ఓ పుస్తకాన్ని రాసింది. దాని పేరు ‘వర్మ మన ఖర్మ’. ఈ పుస్తకాన్ని సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్మ కూడా విచ్చేశారు. ఆయన చేతుల మీదగానే ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా తన మనసులోని భావాలను బహిర్గతం చేశారు వర్మ.