ప్రభాస్ లాంటి నేషనల్ స్టార్ తో పాన్ ఇండియా సినిమా చేసినా దర్శకుడు సుజిత్ కి ఒక హీరో ఇప్పటివరకు దొరకలేదు..రన్ రాజా రన్ లాంటి ఫ్రెష్ సినిమా తో వచ్చి ప్రేక్షకులను మెప్పిచ్చిన సుజిత్ తన రెండో సినిమానే ప్రభాస్ తో చేయడం పెద్ద అచీవ్ మెంట్ అనుకున్నారు.. అయితే సినిమా రిలీజ్ అయ్యాక కానీ సుజిత్ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు.. సాహో సినిమా ఫ్లాప్ అవడంతో ఈ దర్శకుడి సినిమా రాత చాలా మారిపోయిందని చెప్పొచ్చు. అదే హిట్ అయితే టాలీవుడ్ లోని టాప్ హీరోలు అందరు ఈ దర్శకుడి కోసం క్యూలు కట్టేవారు..