స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని 'సరిలేరు నీకేవ్వరు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సురేందర్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా ని హీరోయిన్ గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో రష్మిక కి గోల్డెన్ హ్యాండ్ అన్న పేరుంది..ఆమె నటించిన చలో, గీత గోవిందం, , సరిలేరు నీకివ్వరు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. మరీ రష్మిక రాక అఖిల్ కి ప్లస్ అవుతుందా చూడాలి.