అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో అందరికి తెలిసిందే.. హీరో విజయ్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన సినిమా..అలాగే డైరెక్టర్ సందీప్ వంగ రేంజ్ ని కూడా మార్చేసిన సినిమా.. ఇదే సినిమాను బాలీవుడ్ లో కూడా చేసి అంతకుమించి హిట్ కొట్టాడు. ఈ సినిమా తో ఒక్కసారిగా బాలీవుడ్ హీరోల మదిలో చోటు సంపాదించుకున్నాడు..ఈ సూపర్ డూపర్ హిట్ కొట్టి ఓ దశలో బాలీవుడ్ లో సెటిల్ అయిపోతాడు అన్న లెవెల్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు..