బోయినపల్లి కిడ్నాప్ కేసులో నిందితుడైన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ బెంగళూరులో ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అతని కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువులైన ముగ్గురిని కిడ్నాప్ చేయించడం కోసం పథకం రచించిన భార్గవ్‌రామ్.. ఇందుకోసం కర్నూలు జిల్లా నుంచి 15 మందిని రప్పించినట్టు పోలీసులు చెబుతున్నారు.