మహాభారతం ని సినిమా రూపంలో తెరకెక్కించాలని టాలీవుడ్ లో చాలామంది దర్శక దిగ్గజాలు ప్రయత్నిస్తున్నారు.. నిర్మాత అల్లు అరవింద్ కూడా తన బ్యానర్ లో మహాభారతం ని తెరకెక్కించాలని చూస్తుండగా రాజమౌళి అయితే ఇది ఏకంగా తన డ్రీం ప్రాజెక్ట్ అని కూడా చెప్పాడు. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ఈ సినిమా ని దేశంలో చాలామంది ప్రముఖులు తెరకెక్కించాలని ముచ్చటపడుతున్నారు. అయితే ఈ సినిమా చేయాలంటే మాములు కాదు. బాహుబలి లాంటి సినిమా చేసిన రాజమౌళి ఈ సినిమా చేయాలంటే తడబడుతున్నాడు..