పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా ను పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ వేసవికి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా బాలీవుడ్ పింక్ సినిమా కి రీమేక్.. శృతి హసన్ కథానాయిక.. సంక్రాంతి కానుకగా టీజర్ రిలీజ్ చేస్తామని అంటున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే వచ్చిన ఓ పాట సోషల్ మీడియా లో దుమ్ము రేపింది.. అంజలి, నివేద థామస్ లు ప్రత్యేక పాత్ర లో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర లో నటిస్తుండడం విశేషం..