టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టినా చేతిలో ఎలాంటి సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాడు వంశీ పైడిపల్లి.. సినిమా సినిమా కు గ్యాప్ ఇచ్చే వంశీ కి ఈ సారి పెద్ద గ్యాప్ వచ్చింది.. మహర్షి తో ఇండస్ట్రీ హిట్ కొట్టినా ఎందుకో వంశీ పైడిపల్లి కి పెద్ద హీరో తో సినిమా సెట్ కాలేదు. మహేష్ బాబు ఊరించి ఊరించి ఇప్పటివరకు సినిమా మొదలు పెట్టలేదు..అసలు మొదలుపెడతాడో లేదో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో వేరే హీరో కి వంశీ వెళ్లక తప్పట్లేదు. ఇప్పటికే ఆహా లో డైరెక్టర్ గా ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు వంశీ పైడిపల్లి..