టాలీవుడ్ లో సింగర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అది తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇటీవలే కొంతమంది సన్నిహితుల మధ్య ఆమె రెండో వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి టాలీవుడ్ లోని పలువురు ఆమెకు విషెష్ చెప్పగా చాలామంది సునీత ఈ పెళ్లి చేసుకోవడం పట్ల సంతోషించారు. ఆమె తన మొదటి భర్త తో విడిపోయి చాల రోజులయ్యింది.. అయితే తన పిల్లలకోసం ఆమె ఇన్నాళ్లు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అయితే పిల్లలే దగ్గరుండి ఆమెకు ఈ పెళ్లి చేయడం విశేషం..