రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొన్ని రోజుల క్రితం లైగర్ ఫస్ట్ లుక్ తో అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. అంతేకాదు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి డబల్ ట్రీట్ ఇచ్చాడు కూడా.. చాల రోజుల తర్వాత విజయ్ సినిమా అప్డేట్ రావడంతో అభిమానులు దాన్ని పండగలా చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు లైగర్ పోస్టర్ ని బ్యానర్ లు గా కట్టి అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు..పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండగా రొమాంటిక్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు.