టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ లకు కొదువలేదు.. కొంచెం టాలెంట్ తో పాటు గ్లామర్ కూడా ఉంటే ఆమెకు వరుస అవకాశాలు వస్తుంటాయి.. ఆవగింజంత అదృష్టం ఉంటే ఆమె స్టార్ హీరోయిన్ అవడం పక్కా.. చాలామంది హీరోయిన్ లు ఇక్కడ అవకాశాలు అందిపుచ్చుకుని పెద్ద రేంజ్ కి వెళ్లి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఏవో కారణాల వల్ల మధ్యలోనే కెరీర్ ను వదిలేశారు.. అలాంటి హీరోయిన్ లలో ఒకరు రెజీనా కసాండ్రా.. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించి రెజీనా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అయితే టాప్ హీరోయిన్ గా మాత్రం కాలేకపోయింది.