నటన అనేది ఒక అద్భుతమైన కళ. సాధారణ ప్రజలకు ఉన్నట్లుగానే నటీనటులకు కూడా వారి జీవితంలో ఎన్నో కష్టాలు, సంతోషాలు, బాధలు కలగలిపి ఉంటాయి. కానీ ఒక్కసారి సెట్లోకి వచ్చి కెమెరా ఆన్ అయితే చాలు, క్యారెక్టర్ లో లీనమై నవ్వులు పండిస్తారు, అలాగే పాత్రను బట్టి వీక్షకుల హృదయాలను కరిగించి కన్నీళ్లు తెప్పిస్తారు నటీనటులు.