టాలీవుడ్ లో టాప్ సంగీత దర్శకులు అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరు.. ఒకరు దేవి శ్రీ ప్రసాద్, మరొకరు తమన్.. వీరిద్దరూ ఒకరి తర్వాత టాప్ హీరోల సినిమాలు చేస్తూ మూడో సంగీత దర్శకుడికి అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు.. వారి రేంజ్ కి తగ్గట్లు హీరోలకు మంచి మంచి సంగీతం అందిస్తూ వారు కూడా తమని దాటి పోనీయకుండా చేసుకుంటున్నారు..వీరి మధ్యనే టాప్ వన్ అండ్ టూ ల చైర్ మారుతూ ఉంటుంది..  ప్రస్తుతం తమన్ తన కెరీర్ లో ఎప్పుడు లేని పొజిషన్ లో ఉన్నాడు..