టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరున్న హీరో తరుణ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తరుణ్ ప్రముఖ సినీ నటి రోజా రమణి కొడుకు కావడం విశేషం. ఏడేళ్ల ప్రాయం నుండే సినీ జీవితాన్ని ఆరంభించాడు. యువ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాక ముందు వరకు ఆరు సినిమాల్లో బాలనటుడిగా నటించి మెప్పించాడు.